అలాంటి వారిలో దేవ్ గిల్ కూడా ఒకరు అని చెప్పాలి. ఒకప్పుడు ఏదైనా సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర ఉంది అంటే చాలు దర్శక నిర్మాతలు ముందుగా దేవ్ గిల్ ను సంప్రదించేవారు. అంతలా ఒక వెలుగు వెలిగారు ఆయన. ఇక విలన్ పాత్రలో ఆయన ఎంతలా ఒదిగిపోయే వారంటే ఏకంగా రాజమౌళి లాంటి దర్శకుడికి ఆయన నటన నచ్చేసింది. ఇంకేముంది ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మగధీర సినిమాలో కూడా దేవ్ గిల్ కి ఛాన్స్ ఇచ్చాడు. రాజమౌళి సినిమాలో విలన్ అంటే పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఏకంగా రణదేవ్ బిల్లా పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు దీంతో అతను ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.
అంతేకాదు ప్రేమ కావాలి, పూలరంగడు లాంటి హిట్ సినిమాలలో కూడా నటించాడు. ఇక ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించిన దేవ్ గిల్ ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో కనుమారుగయ్యాడు అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు విలన్స్ గా చేసిన వారు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ దేవ్ గిల్ మాత్రం అటు విలన్ పాత్రలను దక్కించుకోలేక.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక.. చివరికి ఇండస్ట్రీకి దూరమైపోయాడు. కానీ దేవ్ గిల్ విలన్ గా పోషించిన పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఇక దేవ్ గిల్ కి మళ్ళీ అవకాశాలు వచ్చి విలన్ గా రాణించాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలీ.