మరి ముఖ్యంగా ఫుడ్ డైట్ విషయంలో ఉపాసన తీసుకునే కేరింగ్ వేరే లెవల్ అని చెప్పాలి . అలాంటి ఉపాసన కడుపుతో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి హెల్త్ కేర్ తీసుకుంటూ ఉపాసన కోసం స్వయంగా ఇంట్లో చేసిన పిండివంటలను పంపించింది . అప్పుడు దానికి సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే అప్పుడు కడుపుతో ఉన్న ఉపాసన కోసం లక్ష్మీపతి చేసిన పని ఇప్పుడు ఉపాసన తన తోటి కోడలను లావణ్య త్రిపాఠి కోసం చేస్తుందట. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని ..ఆమె గుడ్ న్యూస్ దసరా సందర్భంగా కుటుంబ సభ్యులకు వినిపించింది అని.. ఆ కారణంగానే మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది అంటూ ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
దానికి తగ్గట్టే దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫ్యామిలీ పిక్ లో లావణ్య త్రిపాఠి కొంచం బొద్దుగా కనిపించడం ..అదేవిధంగా బేబీ బంప్ లైట్ గా కనిపిస్తూ ఉండడం అందరికీ ఈ విషయాన్ని కన్ఫామ్ చేసినట్లయింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కానీ అటు లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ కూడా ఈ విషయంపై స్పందించలేదు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా ఉపాసన తన చేతులతో సొంతంగా వండిన పిండివంటలను లావణ్య త్రిపాఠి కి పంపించిందట . మొదటి నుంచి లావణ్య త్రిపాఠి అంటే చాలా స్పెషల్ గా చూసుకునే ఉపాసన ..వరుణ్ - లావణ్య పెళ్లి లో కూడా ఎంత హంగామా చేసిందో చూసాం. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది అని తెలుసుకున్న ఉపాసన ఆమెకు పిండి వంటలు పంపించడమే కాకుండా స్పెషల్ గా అపోలో హాస్పిటల్స్ లోనే ట్రీట్మెంట్ కూడా అందుకునేలా జాగ్రత్తలు తీసుకుంటుందట . ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!