దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . జక్కన్న అంటూ ముద్దుగా ట్యాగ్ చేయించుకునేటటువంటి రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబు సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు . ఈ సినిమా కోసం ఏఐ టెక్నాలజీని వేరే లెవెల్ లో ఉపయోగించడానికి ప్లాన్ చేస్తున్నాడు . దానికోసం స్పెషల్ గా క్లాసెస్ కూడా తీసుకుంటున్నారట . ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన ప్రతి వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రాజమౌళి ఒకవేళ డైరెక్టర్ కాకుండా ఉంటే ఏమై ఉండేవాడు..? అనే విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు.
మనకు తెలిసిందే రాజమౌళి ఏమి కూడా రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోలేదు . దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ..ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది . ఆయన డైరెక్టర్ గా ఎదగడానికి చాలా కష్టపడ్డారు . ఇదే విషయాని ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆయనకు సంపాదన లేనప్పుడు రమా రాజమౌళి ఉద్యోగం చేసి ఆయనకు డబ్బులు ఇచ్చింది అని కూడా చెప్పుకొచ్చాడు . ఒకానొక టైంలో రాజమౌళి ఇక డైరెక్టర్ గా సెటిల్ అవ్వలేను అంటూ భయపడి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకోనైనా సరే కుటుంబాన్ని పోషించాలి అంటూ డిసైడ్ అయ్యారట . కానీ రమా రాజమౌళి ఒప్పుకోలేదట. "నువ్వు అనుకున్న పని ట్రై చేయ్యి " అంటూ బాగా సపోర్ట్ చేసిందట. ఆ కారణంగానే రాజమౌళి ఇప్పుడు ఇంతటి స్టార్ పొజిషన్లో ఉన్నాడు అంటున్నారు అభిమానులు . రాజమౌళి మంచోడే కాదు మహా మొండోడు కూడా అని అంటున్నారు జనాలు..!