ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా ఉన్నంత వరకు సౌత్ నుంచి నార్త్ వరకు మరో సినిమా చర్చ రాలేదు.. అలాగే దేవర దండయాత్ర మొదలైన అంతసేపు పాన్ ఇండియా లెవెల్ లో మరో సినిమా గురించి ఎలాంటి వార్తలు వినిపించలేదు. అలాగే ఏదైనా సినిమా రిలీజ్ అయితే ప్లాప్ అవ్వటమో డిజాస్టర్ టాక్ తెచ్చుకుని సినిమా  పక్కకు వెళ్లిపోయేది. జూన్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో ఇదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కట్ చేస్తే ఇంత కాలానికి దేవర సునామీని తట్టుకొని ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అది కూడా మామూలుగా కాదు బ్లాక్ బస్టర్ గా తొలి ఆటతోనే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఈ వారం లక్కీ భాస్కర్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది, అలాగే క టైటిల్ తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దండయాత్ర మొదలుపెట్టాడు. అలాగే శివ కార్తికేయన్‌ అమరాన్ తో బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించాడు.


 ఇలా ఈ ముగ్గురిలో దేవర దండయాత్రను తట్టుకొని నిలబడింది ఎవరు? ఇంతకాలం తర్వాత అది కూడా దేవర తర్వాత టాలీవుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న మూవీ అంటే ఓ సెన్సేషన్.. ఇంతకీ ఆ మూవీ పేరు ఏంటంటే..? దేవర దెబ్బకి హిందీలో అలియా జిగ్రా ప్లాఫ్ అయింది.. కోలీవుడ్లో రజినీకాంత్ వేటాయన్ కొట్టుకుపోయింది. ఇలాంటి ఈ ఉర‌ మాస్ మూవీ క్రేజ్ కి పెద్ద హీరోలు హీరోయిన్లే తట్టుకోలేకపోయారు.  ఇక మీడియం రేంజ్ స్టార్లెం తట్టుకుంటారు. అందుకే రెండు నెలలగా పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ మొత్తం వార్ వన్ సైడ్ అయింది. కానీ దీపావళి తర్వాత ఆ లెక్క మారింది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం  క సిమాలు విడుదలయ్యాయి వీటికి పోటీగా కోలీవుడ్ మూవీ అమరన్‌ వచ్చింది . ఇలా ఈ మూడు సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ టాక్ ని , మరొకటి హిట్‌ టాక్ ని, ఇంకొకటి యావరేజ్ టాక్  ని తెచ్చుకున్నాయి. దేవర సునామి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా సినిమా హిట్ అవ్వటం అనేది ఈ వారమే మొదలైంది. ఇక  దుల్కర్ సల్మాన్,న‌టించిన‌ లక్కీ భాస్కర్ విషయానికొస్తే, బ్యాంక్ ఉద్యోగా స్కామ్ లు చేస్తూ కోట్లు గడించి, తర్వాత వచ్చే సమస్యల్లోంచి ఎలా భయట పడ్డాడనే పాయింట్ తో వచ్చింది . ఈ సినిమా కథ కత్తిలా ఉందంటున్నారు. కథనం విషయంలో వెంకీ అట్లూరి పై పొగడ్తల వర్షం కురుస్తోంది.


దుల్కర్ సల్మాన్ అంతా తానై సినిమాను తన భుజాల మీదే మోశాడు. అలాగే మహానటి, సీతారామం లాంటి విజ‌య‌లు తర్వాత దుల్కర్ కి మళ్లీ లక్ కలిసొచ్చిందంటున్నారు. ఆల్ మోస్ట్ మొదటి షోకే హిట్ టాక్ వచ్చేసింది.. అలాగే ఈ సినిమాకు పోటిగా వ‌చ్చిన  క మూవీ అయితే ఏకంగా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ కంటే తక్కేవ స్టామినా ఉన్న కిరణ్ అబ్బవరం చేసిన ప్రయోగమే క. టైటిలే వింత అనుకుంటే కథ చెప్పిన విధానం, ఊహికందని క్లైమాక్స్ కి జనం ఫిదా అయ్యారు. కథ, కథనం, పెర్ఫామెన్స్, మ్యూజిక్ ఓవరాల్ గా క్లైమాక్స్ ప్రేక్ష‌కుల మతిపోగొట్టింది. దేవర లాంటి సునామీ తర్వాత మరో తెలుగు సినిమా ఈరేంజ్ లో దేవర దరువుని తట్టుకోవటమే వింతంటే, ఈ రేంజ్ లో హిట్ టాక్ రావటం మరో వింత.. మొత్తంగా లక్కీ భాస్కర్ కి హిట్ టాక్ వస్తే, క సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక కోలీవుడ్‌ మూవీ అమరన్ కి మరో మేజర్ గా పర్లేదనే టాక్ వ‌చ్చింది. ఇలా మొత్తంగా దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సౌత్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న రెండు సినిమాలు తెలుగువే అవటం ఇక్కడ మ‌రో గొప్ప విష‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి: