ఎవరు ఊహించని వైవిద్య కాన్సెప్టులతో సినిమాలు తీస్తూ, వాటిలో నటిస్తూ హీరో ఉపేంద్ర సౌత్ లోనే విభిన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఆయన చేసిన సినిమాల్లో ఓం, ఏ ర, ఉపేంద్ర, హెచ్2ఓ... ఇలాంటి విభినమైన సినిమాలే చెబుత‌యి ఉపేంద్ర ఎంతటి టాలెంటెడ్ హీరో , డైరెక్టర్ అని.. అలాగే సమాజంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ, వాటిపై సెటైరికల్ గా, అలాగే ప్రేక్ష‌కులకు నచ్చేలా ఆయన సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ ఉపేంద్ర క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన సినిమాలు వస్తున్నాయంటే తెలుగులో ధియేటర్లు కూడా కలకలాడుతాయి. కేవలం ఒక హీరో గానే కాకుండా సన్నాఫ్ సత్యమూర్తి గని వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.


56 ఏళ్లలో సుమారు 60కి పైగా సినిమాల్లో నటించాడు అలాగే పదుల సంఖ్యలో సినిమాలను తేర‌కేక్కించాడు. ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉపేంద్ర. చాలా కాలం తర్వాత ఉపేంద్ర మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు ఆయన హీరోగా నటించి దర్శకత్వం వహిస్తున్న UI సినిమా విడుదలకు రెడీగా ఉంది. అదేవిధంగా ఉపేంద్ర మాత్రమే కాదు ఆయన భార్య కూడా ఓ క్రేజీ హీరోయిన్.. టాలీవుడ్ లో కూడా ఈమే పాలు సినిమాల్లో నటించింది. ఇంతకీ ఆమె మరెవరు కాదు ప్రియాంక త్రివేది. ఈ పేరు చెప్పితే సరిగా గుర్తుకు రాపోవచ్చు కానీ జెడి చక్రవర్తి నటించిన సూరి సినిమా హీరోయిన్ అంటే చాలామందికి ట‌క్కున గుర్తుకు వస్తుంది.


అలాగే వీటితో పాటు ఉపేంద్ర హీరోగా వచ్చిన రా, హేచ్2 ఓ సినిమాల్లో కూడా ప్రియాంకనే హీరోయిన్గా నటించారు. నిజానికి ఈ సీనియర్ నటి 50కు పైగా సినిమాల్లో నటించారు. కన్నడ , తమిళం , బెంగాలీ భాషల్లో ఎక్కువ సినిమాలు చేశారు. అలాగే గత సంవత్సరం ప్రియాంక నటించింన‌ 50వ సినిమా డిటెక్టివ్ తీక్షణ రిలీజ్ అయింది.  ఇటీవలే ఉగ్రావతారం అనే సినిమాలోని మెయిన్ లీడ్ లో ఈమె నటించింది. ఇక ఈమె సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ లో త‌న‌ అదృష్టం పరీక్షించుకుంది ప్రియాంక. మిస్ కోల్ కతా కిరీటం కూడా సొంతం చేసుకుంది. ఇక ఉపేంద్ర, ప్రియాంకల వివాహం 2003లో జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారు కూడా త్వరలోనే చిత్ర పరిశ్రమలు అడుగు పెడతారని కూడా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: