ఇక సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాలకు పెద్ద పండుగ లాంటిది.. ఆ సమయంలో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు తమ సినిమా రిలీజ్ చేయాలని ఎంతో ఆశ పడుతుంటారు. వచ్చే సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో గట్టి పోటీ కనిపిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి విశ్వంభ‌ర‌ సంక్రాంతి నుంచి తప్పుకుని మే 9 కి వాయిదా పడింది. ఈ సినిమా ప్లేసులో ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ సంక్రాంతి బరిలో ఉంది. అలాగే వీటితో పాటు అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రానుంది. ఈ రెండు సినిమాలు అధికారికంగా సంక్రాంతికి వస్తున్నాటు ప్రకటించాయి. అలాగే  ఈ రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాత కావటం విశేషం. కాబట్టి నైజాం ఏరియాలో వీటికి అధికంగా థియేటర్లు దొరకబోతున్నాయి. అలాగే నట‌సింహం నందమూరి  బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు.


సినిమా కూడా సంక్రాంతికి రాబోతుంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు. అదే విధంగా బాలయ్యతో ఓ భారీ సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బాలయ్య దానికి ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. అందుకు కారణం కూడా ఉంది.. తన 100వ  సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి థియేటర్ లో మంచి కలెక్షన్లు వస్తున్న..దిల్ రాజు ఆ సినిమాను థియేటర్ నుంచి హఠాత్తుగా తీసేసి వేరే సినిమాలు వేశారు. అప్పటినుంచి బాలయ్య దిల్ రాజును దూరం పెడుతూ వస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం  ఉండటం బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు తన కెరియర్లో మంచి ఫామ్ లో ఉన్నారు.


ఇక ఇలాంటి సమయంలో బాలయ్యతో సినిమా తీస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్లో టికెట్లు రేట్లు పంచుకోవడానికి అనుమతి వస్తుందని దిల్ రాజు ఆలోచన కానీ రేపు సంక్రాంతికి ఈ రెండు  సినిమాలకు థియేటర్లో కేటాయించుకుంటే బాలయ్య సినిమాకు థియేటర్లు దొరకటం చాలా కష్టమవుతుంది.  అలా అని తన సొంత సినిమాలకు తగ్గించి బాలయ్య సినిమాకు దిల్ రాజు థియేటర్లు ఇచ్చే అవకాశం కూడా ఉండదు.. ఏమో కొన్ని పనికిమాలిన థియేటర్లు ఇస్తే అభిమానులు అసలు ఊరుకోరు. అలాగే బాలకృష్ణ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే బాలయ్య దిల్ రాజు మధ్య కనపడని యుద్ధం నడుస్తుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లు ఇవ్వకపోతే ఈ వివాదం ముదిరి మరింత పాకనపడే ఛాన్స్ కూడా ఉంది అప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: