అతి దగ్గర బంధువుల మధ్య ..పెద్దల సమక్షంలో నార్నే నితిన్ నిశ్చితార్థం చేసుకున్నాడు . మ్యాడ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు సినిమాలతో క్రేజ్ దక్కించుకోవడానికి చూశాడు . కానీ అంత స్థాయికి ఎదగలేకపోయాడు . "ఆయ్" సినిమాతో మంచి క్రెజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆ తర్వాత దానికి తగ్గట్టు అవకాశాలు అందుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. కాగా నిన్న ఆయన నిశ్చితార్థం జరిగింది .
శివాని అనే అమ్మాయిని ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు . కాగా శివాని కుటుంబం వెంకటేష్ కి దగ్గర బంధువులు . ఎంగేజ్మెంట్ కి టాలీవుడ్ నుంచి అనేక మంది స్టార్స్ కూడా హాజరయ్యారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ -లక్ష్మీ ప్రణతి -అభయ్ రామ్ -భార్గవ్ రామ్ ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . ఇదే క్రమంలో వెంకటేష్ ని సరదాగా ఆట పట్టించాడు ఎన్టీఆర్ చిన్న కొడుకు . వెంకటేష్ దగ్గరికి తీసుకోగానే ఎన్టీఆర్ చిన్న కొడుకు "వెంకీ మామ..వెంకీ మామ..వెంకీ మామ" అంటూ అల్లరి అల్లరి చేశాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ కొడుకు మహా అల్లరోడే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఫంక్షన్ లో తన మామతో సర్దాగా ఫోటోలు దిగ్గి..అల్లరి అల్లరి చేసేస్డాడు తారక్ చిన్న కొడుకు..!