దాదాపు మన సీనియర్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన భానుప్రియ.. వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ , చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు . ఇక ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు .. చత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు భానుప్రియ . అయితే భానుప్రియ చెల్లి కూడా హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు .. ఆమె కూడా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించింది . ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది .. ఏం చేస్తుంది .. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం .
ఇంతకీ భానుప్రియ చెల్లి పేరు శాంతి ప్రియ .. ఈమె కాబోయే అల్లుడు అనే సినిమా తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అలాగే సింహాసనం ,యమభాసం ,రక్త కన్నీరు , అగ్ని, కలియుగ అభిమన్యుడు వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అలాగే ఈమె టాలీవుడ్ తో పాటు తమిళం హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసింది .. ప్రస్తుతం ఈమె సినిమాలు తగ్గించి వరుస హిందీ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెరపై బిజీగా కొనసాగుతున్నారు .