ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన కే జి ఎఫ్ సిరీస్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ "సలార్" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడమ విడుదల అయ్యి మంచి కలెక్షన్లను రాబట్టింది. కానీ బ్లాక్ బస్టర్ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. ఈ సినిమా రాంగ్ టైమ్ లో విడుదల కావడం ద్వారానే భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసుకోలేక పోయింది అని చాలా మంది ఆ సమయంలో అభిప్రాయపడ్డారు.

ఎందుకు అంటే ఈ మూవీ విడుదల అయిన సమయం లోనే హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన డంకి సినిమా కూడా థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఆ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది. దానితో నార్త్ ఏరియా నుండి సలార్ మూవీ కి కాస్త కలెక్షన్స్ తగ్గాయి. దానితో ఈ మూవీ భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసుకోలేదు అని చాలా మంది ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. ఇకపోతే తాజాగా భగీర అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందించాడు. ఈ మూవీ కూడా రాంగ్ టైమ్ లోనే విడుదల అయింది.

తెలుగులో ఈ సినిమా విడుదల అయిన రోజు క , లక్కీ భాస్కర్ అనే రెండు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే అమరన్ అనే ఒక తమిళ డబ్బింగ్ సినిమా కూడా విడుదల అయింది. ఇక భగీరతో పోలిస్తే ఈ మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. దానితో భగీర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావడం లేదు. దానితో చాలా మంది భగీర సినిమాను రాంగ్ టైమ్ లో విడుదల చేశారు. వేరే టైమ్ లో విడుదల చేసి ఉంటే కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చేవేమో అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: