ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మూవీ యొక్క మొదటి భాగంలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఇక సమంతకు సూపర్ క్రేజ్ ఉండడం , అలాగే ఆ పాట కూడా అద్భుతంగా ఉండడం , అందులో సమంత తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ విజయంలో ఈ సాంగ్ కూడా కీలక పాత్రను పోషించింది. పుష్ప పార్ట్ 1 లో ఐటెం సాంగ్ సూపర్ సక్సెస్ కావడంతో పుష్ప పార్ట్ 2 కూడా అంతకు మించిన స్థాయిలో స్పెషల్ సాంగ్ ఉండాలి అని అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటి నుండో భావిస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఎంతోమంది క్రేజ్ ఉన్న హీరోయిన్లను మొదట ఈ మూవీ బృందం స్పెషల్ సాంగ్ కోసం అనుకున్న చివరకు శ్రీ లీలా ను ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ కి మేకర్స్ సెలెక్ట్ చేశారు. దీనితోనే బన్నీ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే సమంత కంటే శ్రీ లీల క్రేజ్ తక్కువ. సమంత కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాల్సిన ఐటమ్ సాంగ్ కి అంతకంటే తక్కువ క్రేజ్ ఉన్న బ్యూటీని తీసుకుంటున్నారు. ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది అని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: