సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అంతంత మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం హీరో హీరోయిన్లు బట్టలు విప్పేసి మరీ పూర్తి నగ్నంగా నటించడానికి కూడా ఓకే చెబుతున్నారు. అయితే అప్పటి జనరేషన్ కి అదే ఎక్కువ. కానీ ఇప్పటి జనరేషన్ కి ఎంత విప్పి చూపించినా కూడా ఇంకా చాలదు అన్నట్లు  ఇంకా కొత్తదనం కావాలి అనేటట్లు ఉన్నారు. అయితే అలాంటిదే ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాం.అదేంటంటే..అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున హీరోయిన్లతో వల్గర్ గా ప్రవర్తించడంతో కొడుక్కి వార్నింగ్ ఇచ్చారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జునకి మన్మధుడిగా పేరు ఉంది.  ఈయన ఎంతోమంది హీరోయిన్లతో జోడి కట్టారు. అలా ఎన్నో రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించారు.

దాంతో ఈయనను అందరూ గ్రీకువీరుడు, కళల రాకుమారుడు అని, మన్మధుడు అని ఇలా ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఇక మామూలు అమ్మాయిలకే కాదు ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోయిన్లకు కూడా నాగ్ మన్మధుడు.. అయితే అలాంటి నాగార్జున హీరోయిన్ల పట్ల ప్రవర్తించిన తీరును చూసి ఏఎన్నార్ సైతం షాక్ అయ్యి కొడుక్కి వార్నింగ్ ఇచ్చారట. నువ్వు హీరోయిన్ లతో డాన్స్ లు చేసే సమయంలో చాలా వల్గర్ గా చేస్తున్నావు.కాస్త ఆ వల్గర్ ని తగ్గించుకో కాస్త పద్ధతిగా ఉండే డాన్సులు చేయి అని నాగార్జునకి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారట. కానీ నాగార్జున మాత్రం ఏంటి నాన్న జనరేషన్ కి తగ్గట్లు మనం కూడా మారుకుంటూ పోవాలి..

లేకపోతే వెనకబడి పోతాం.మీరు ఓన్లీ నా సినిమాలు మాత్రమే చూస్తున్నారు కావచ్చు. ఇంకా వేరే హీరోలు మాత్రం నాకంటే ఎక్కువ రొమాంటిక్ గా చేస్తున్నారు. కానీ మీరు మాత్రం నన్నే అంటున్నారు. ఒకవేళ నేను జనరేషన్ కి తగ్గట్టు మారకపోతే మళ్లీ వెనుకబడిపోతే మీకే ఇబ్బంది అంటూ తండ్రికి అర్థం అయ్యేలా నాగార్జున చెప్పారట. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు అవునవును జనరేషన్ కి తగ్గట్టు మారకపోతే అభిమానులు పట్టించుకోరు అంటూ కొడుకు మాటలతో ఏకీభవించారట. అయితే ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు ఓ టాక్ షోలో బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: