దివంగత నటి సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందం, సాంప్రదాయం కలగలిపిన రూపమే సౌందర్య. ఎలాంటి పాత్రలోనైనా తన వంతు న్యాయం చేసేది. తన సహజమైన సౌందర్యంతో, పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. ఎలాంటి గ్లామర్ షోలు చేయకుండా సాంప్రదాయంగా, సహజనటిగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.


సౌందర్య ఇండస్ట్రీకి భౌతికంగా దూరమై 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన సినిమాలతో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా....ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కొణిదెల పవన్ కళ్యాణ్ లో మైలురాయిగా నిలిచిపోయే ఎన్నో సినిమాల్లో నటించారు. తన సినీ కెరీర్ లో రెండో చిత్రం గోకులంలో సీత, మూడో చిత్రం సుస్వాగతం లో నటించారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన దేవయాని హీరోయిన్ గా నటించింది.


అయితే దర్శకుడు శ్రీనివాసరావు మాత్రం ఈ సినిమాలో సౌందర్యను హీరోయిన్గా పెట్టి తీయాలని అనుకున్నారట. ఆ పాత్రకి సౌందర్య మాత్రమే న్యాయం చేయగలరని నమ్మకంతో ఉన్నారట. అన్ని ఓకే అయ్యాక సౌందర్యతో మాట్లాడబోతున్నారని తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలోనే భీమినేనికి ఫోన్ చేసి దయచేసి సౌందర్యను హీరోయిన్గా తీసుకోవద్దు అని పవన్ కోరాడట.


దీనికి కారణం అప్పటికే సినీ పరిశ్రమలో సౌందర్య స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాకుండా సౌందర్య వయసులో పవన్ కళ్యాణ్ కన్నా పెద్దది. ఈ రెండింటికన్నా ముఖ్య కారణం సౌందర్య సీనియర్ కావడం, పవన్ కళ్యాణ్ అప్పుడే కొత్తగా వస్తున్న హీరో కావడంతో సౌందర్యను తన సినిమాలో హీరోయిన్గా వద్దని డైరెక్టర్ తో రిక్వెస్ట్ చేశాడట. ఇక పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ మేరకు ఈ సినిమాలో సౌందర్యను కాకుండా దేవయానిని హీరోయిన్గా పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: