సాధారణంగా ఈతరం దర్శకులు ఇండస్ట్రీలోకి రచయితలుగా నటులుగా రాణించాలని ఇండస్ట్రీలోకి వచ్చి అక్కడ అదృష్టం కలిసిరాకపోవడంతో దర్శకులుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆలిస్టులో వెంకీ అట్లూరి ఒకరు. ఒకప్పుడు వరసపెట్టి సినిమాలు తీసిన మధురా శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘స్నేహగీతం’ మూవీలో వెంకీ అట్లూరి హీరో పాత్ర చేశాడు.



అయితే ఆసినిమా ఫ్లాప్ అవ్వడంతో అతడికి అవకశాలు రాకపోవడంతో ఆతరువాత రచయితగా మారి కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశాడు. ఆతరువాత వరుణ్ తేజ తో ‘తొలిప్రేమ’ మూవీ తీసి తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆతరువాత అఖిల్ తో తీసిన మజ్ను నితిన్ తో తీసిన ‘రంగ్ దే’ ఫెయిల్ అవ్వడంతో దర్శకుడుగా అతడికి అవకాశాలు తగ్గిపోయాయి.



ఇలాంటి పరిస్థితులలో అతడికి తమిళ టాప్ హీరో ధనుష్ తో సినిమా తీసే అవకాశం అనుకోకుండా లభించడంతో పాటు ఆమూవీ హిట్ అవ్వడంతో అతడి సమర్థతను గుర్తించిన దుల్కర్ వెంకీ అట్లూరిని నమ్మి చేసిన ‘లక్కీ భాస్కర్’ మూవీ విజయం సాధించడంతో తిరిగి వెంకీ అట్లూరి క్రేజ్ ఇండస్ట్రీలో ప్రారంభం అయింది. 1990లో జరిగిన హర్షత్ మెహత స్కామ్ ను నేటితరం ప్రేక్షకులకు గుర్తు చేస్తూ తీసిన ‘లక్కీ భాస్కర్’ మూవీ కథలో కొన్ని మితిమీరిన అవాస్తవాలు ఉన్నప్పటికీ సినీ ఫక్కీలో తీసిన వెంకీ అట్లూరి టేకింగ్ కు సగటు ప్రేక్షకుడు ప్రశంసలు కురిపిస్తున్నాడు.



ఈసినిమా సక్సస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్లు నాగ్ అశ్విన్ హను రాఘవపూడి లు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంలో ఈ స్టార్ డైరెక్టర్స్ ఇద్దరూ హను రాఘవపూడి పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అతడు రానున్న రోజులలో టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడుగా మారుతాడని అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. వాస్తవానికి ఈమూవీ ‘అమరన్’ ‘క’ మూవీలతో పోటీ పడుతూ విడుదల కాకుండా సింగిల్ గా వచ్చి ఉంటే ఈమూవీ కలక్షన్స్ మరింత బాగుండేవి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: