దీపావళి సినిమాల హడావిడి పూర్తి అవ్వడంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల దృష్టి ఈనెల 14న విడుదల కాబోతున్న సూర్య ‘కంగువ’ పై ఉంది. వాస్తవానికి ఈమూవీ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ డైరెక్ట్ తెలుగు మూవీ రేంజ్ లో ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. తమిళ ‘బాహుబలి’ గా ఇప్పటికీ కాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుపుకుంటున్న ఈమూవీ పై విపరీతంగా అంచనాలు ఉన్నాయి.



మూవీ కోసం రెండు సంవత్సరాలు హీరో సూర్య మరో సినిమా ఒప్పుకోకుండా తన దృష్టి అంతా ఈమూవీ పై పెట్టాడు అంటే ఈ మూవీ పై సూర్య ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అర్థం అవుతుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న ఈ మూవీకి స్పెషల్ షోలు తెల్లవారుఝామున ప్రదరశశిస్తున్నారు అంటే తెలుగు ప్రజలు డబ్బింగ్ సినిమాలను ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో అర్థం అవుతుంది.



ముఖ్యంగా ఈమూవీ నిర్మాత జ్ఞానవేలు రాజా 2 వేల కోట్ల కలక్షన్స్ వసూలు చేస్తుంది అని అంటూన్న మాటలు ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాయి. ఈమూవీకి సంబంధించి ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఈమూవీ పై క్రేజ్ ను మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రేంజ్ లో ఈమూవీ పై అంచనాలు ఉన్నప్పటికీ ఈమూవీ ఏదైనా కలక్షన్స్ సంచలనాలు చేయాలి అంటే ఈమూవీకి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంటుంది.



డిసెంబర్ 5న ‘పుష్ప 2’ విడుదల అవుతున్న పరిస్థితుల్లో ‘కంగువ’ హిట్ అయినప్పటికీ ‘పుష్ప 2’ విడుదల అయ్యేంతవరకు మాత్రమే సగటు ప్రేక్షకుడు ‘కంగువ’ గురించి పట్టించకుంటాడు. ‘పుష్ప 2’ టిక్కెట్ల కోసం ఇప్పటి నుండే ధియేటర్లకు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో జ్ఞానవేలు ఆశిస్తున్న 2 వేల కోట్ల కలక్షన్స్ ‘కంగువ’ కు ఎంతవతకు సాధ్యం అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి..











మరింత సమాచారం తెలుసుకోండి: