ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా రెండు తెలుగు సినిమాలు , రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన "క" , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు తెలుగు సినిమాలు. ఈ రెండు మూవీలకు అద్భుతమైన టాక్ వచ్చింది. ఈ మూవీ లతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా అమరన్ కు కూడా మంచి టాక్ రాగా , కన్నడ డబ్బింగ్ సినిమా అయినటువంటి భగీర కు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇకపోతే క , లక్కీ భాస్కర్ , అమరన్ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేశాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ నాలుగవ రోజు ఎన్ని కోట్ల కలక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

నాలుగవ రోజు దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.90 కోట్ల కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక నాలుగో రోజు కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన "క" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.34 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. అమరన్ సినిమా నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.0 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక తమిళ డబ్బింగ్ సినిమా అమరన్ కంటే తెలుగు సినిమా అయినటువంటి "క" సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేయగా "క" సినిమా కంటే లక్కీ భాస్కర్ సినిమా ఎక్కువ కలెక్షన్లను నాలుగో రోజు వసూలు చేసింది. ఇలా నాలుగవ రోజు అన్ని సినిమాలు అద్భుతంగా వసూలు చేశాయి. అలాగే ఒక సినిమాను మించి మరొక సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: