మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్లో రెండవ సినిమాగా మగధీర అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించగా ... ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2009 వ సంవత్సరం జూలై 31 వ తేదీన విడుదల అయ్యి భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అలాగే ఎన్ని సెంటర్లలో వంద రోజులు డైరెక్ట్ గా పూర్తి చేసుకుంది అనే ఇంట్రెస్టింగ్ వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 22.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 13 కోట్లు , ఉత్తరాంధ్ర లో 5.90 కోట్లు , ఈస్ట్ లో 4.32 కోట్లు , వేస్ట్ లో 4.13 కోట్లు , గుంటూరు లో 5.18 కోట్లు , కృష్ణ లో 3.63 కోట్లు , నెల్లూరు లో 3.30 కోట్లు , ఆంధ్ర , తెలంగాణలో కలిపి 61.66 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.30 కోట్లు , ఓవర్సీస్ లో 3.50 కోట్లు. మొత్తంగా ఈ మూవీ తెలుగు వర్షన్ కి 73.46 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. తమిళ్ ప్లేస్ మలయాళ వర్షన్ లకి 4.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 77.96 కోట్ల కలెక్షన్లు ఈ మూవీకి వచ్చాయి. ఈ మూవీ డైరెక్ట్ 223 కేంద్రాలలో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయంలో ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డును సృష్టించగా ... 100 రోజుల కేంద్రాల విషయాలలో కూడా ఈ సినిమా సూపర్ రికార్డును సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: