ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడాల్లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఈ సినిమా అదరగొట్టింది. ఈ 118 సెంటర్లు డైరెక్ట్ సెంటర్లు కావడం గమనార్హం. షిఫ్ట్ తో కలిపి లెక్క వేస్తే ఈ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి స్టామినాకు ప్రూఫ్ ఇదేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీడెడ్ లో సైతం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది.
ఇంద్ర సినిమా కథ, కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. శంకర్ నారాయణ, ఇంద్రసేనారెడ్డి పాత్రలలో చిరంజీవి నట విశ్వరూపం చూపించారు. చిరంజీవి సినిమా కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంద్ర సినిమాకు ముందు ఇంద్ర సినిమా తర్వాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంద్ర సినిమాలో సోనాలి బింద్రే ఒక హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటించారు.
ఇంద్ర సినిమా సాధించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్ తర్వాత రోజుల్లో రిపీట్ కాలేదు. చిరంజీవి బి.గోపాల్ కాంబో ఇండస్ట్రీలోని సెన్సేషనల్ హిట్లలో ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ ఒక్క సినిమా కోసమే చిరంజీవి దాదాపుగా రెండేళ్ల సమయం కేటాయించడం హాట్ టాపిక్ అవుతోంది.