ఎన్టీఆర్.. ఈ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేదు .. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. దేవర సినిమాతో బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టించాడు. నందమూరి వారసుడుగా తారక్ అభిమానుల గుండెల్లో నిలిచాడు. నందమూరి వారసుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.. అందుకే చాలా మందికి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.. అలాచాలా మంది సినిమాలతో పాటుగా రాజకీయ జీవితాన్ని కూడా చూడాలని కోరుతున్నారు .. కానీ ఎన్టీఆర్ మాత్రం అందుకు మౌనంగానే ఉన్నారు.. ఆయన కేరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి .


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతోటాలీవుడ్‌లో త‌న‌ మొదటి హిట్ అందుకున్ని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ కెరీర్‌ లో ఉన్న‌యి .. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . అందుకే ఎన్టీఆర్ సినిమాలకు ప్రత్యేకత ఎక్కువే ..అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.  అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి , ఆది,  యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్, త్రిబుపుల్ ఆర్, దేవ‌ర‌ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. ఎన్టీఆర్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ గెలుచుకోవడంతో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. హాలివుడ్, బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు రావడం విశేషం.. అలాగే తాజాగా వ‌చ్చిన దేవ‌ర సినిమాతో ఎన్టీఆర్ టాలీవుడ్ నూంచి బాలీవుడ్ వ‌ర‌కు అదిరిపోయే రిక్డాలు సృష్టించాడు.. ఈ సినిమాతో ఏకాంగా 500 కోట్లుకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి పాన్ ఇండియ హీరోగా మార‌డు.. ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియ సినిమ‌లు చేస్తున్న‌డు .


అయితే ఎన్టీఆర్ తన చిన్న వయసులోనే టాలీవుడ్ లో తిరుగులేని రికార్డులు సృష్టించాడు. ఆ స‌మ‌యంలో టాలీవుడ్ కే మెగాస్టార్ గా ఉన్న‌ చిరంజీవికే చెమటలు పుట్టించాడు. ఎన్టీఆర్ నటించిన ఆది - సింహాద్రి సినిమాలు టాలీవుడ్ లోనే అత్యధిక సెంటర్లో 100 రోజులకు పైగా తిరుగురేని రికార్డులు సృష్టించాయి. ఎన్టీఆర్రాజమౌళి  కాంబినేషన్లో వ‌చ్చిన‌ సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 7వ సినిమాగా వచ్చిన ఈ సినిమా 2003 జూలై 9 న రిలీజ్ చేశారు. మొదటి 2 రోజులు స్లోగా ఉన్నా. తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. 250 కేంద్రాల్లో 50 రోజులు, 150 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి అదిరిపోయే రికార్డులు కొట్టింది సింహాద్రి. ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఆది’. 2002 మార్చ్ 28న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.  బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రోజుల్లో ఆల్ టైం రికార్డులు సృష్టించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: