ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి  మాస్ ఇమేజ్ ని తీసుకు వచ్చిన చిత్రం ‘దేశముదురు’. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2007 లో రిలీజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేత పూరీ చెప్పించిన డైలాగ్స్ అందర్నీ అలరించాయి. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ టాలీవుడ్ సిక్స్ ప్యాక్ కల్చర్ ని పరిచయం చేశాడు. ఈ మూవీ తరువాత చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చూపిస్తూ బన్నీని అనుసరిస్తూ వచ్చారు. యాపిల్ బ్యూటీ హన్సిక  ఈ చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది.ఇక ఈ సినిమాలో అలీ క్యారెక్టరైజేషన్ అందరి చేత నవ్వులు పూయించింది. చక్రి ఇచ్చిన సంగీతం ఇప్పటికీ చార్ట్ బస్టర్. ‘అట్టంటోడే ఇట్టంటోడే’ ఐటెం సాంగ్ లో బన్నీతో పాటు సీనియర్ హీరోయిన్ రబ్బ వేసిన స్టెప్పులు మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి.ఇదిలావుండగా దేశముదురు సినిమాను మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా కర్ణాటక అలాగే ఇతర ముఖ్యమైన స్టేట్స్ లలో కొన్ని స్పెషల్ షోలు కూడా వేయడం జరిగింది.ఇదిలావుండగా దేశముదురు ఏకంగా 129 సెంటర్ లలో 100 రోజులు ఆడి దుమ్ముదులిపేసింది.అలాగే ఈ చిత్రం ₹ 12.58 కోట్లు మరియు ₹ 9.5 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా. ఈ చిత్రం నాలుగు వారాల్లో ₹ 20 కోట్లు వసూలు చేసింది.

ఇక ఈ సినిమా మాస్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే అందుకుంది. ఏమాత్రం రెస్పాన్స్ రాలేదు అన్నవారికి బాక్సాఫీస్ కలెక్షన్స్ తోనే దేశముదురు సమాధానం చెప్పింది.ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. నైజాంలో 68 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. సీడెడ్ లో అయితే ఈ సినిమాకు ఏకంగా 18 లక్షల వచ్చాయి. ఇక ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే 60 లక్షల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశముదురు 1.46 కోట్ల గ్రాస్ అందుకుంది.ఇక కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా లో కూడా ఈ సినిమాను కొన్ని స్క్రీన్స్ లలోవిడుదల చేశారు. ఇక విడుదల చేసింది కొన్ని సెంటర్స్ లలో అయినా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. పుష్ప తర్వాత బన్నీకి మిగతా రాష్ట్రాలలో కూడా మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే ఇక ఆ బజ్ ద్వారానే ఈ సినిమా ఈ రూట్లో అయితే దాదాపు 4 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకోవడం విశేషం.ఇక మొత్తంగా దేశముదురు కలెక్షన్స్ ప్రకారం ఫస్ట్ డే రూ.1. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. అసలు సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అసలు ఏమాత్రం బజ్ లేదు అని అనవసరంగా విడుదల చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కానీ అల్లు అర్జున్ స్టామినా ఏమిటో మరోసారి ఈ మాస్ సినిమాతో అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: