అయితే వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే కడుపునిండా అన్నం కూడా తినలేరు కొందరు . రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు . అయితే కోట్ల ఆస్తి ఉన్న కొన్ని కోరికలు తీర్చుకునే అదృష్టం కొందరు జనాలకి ఉండదు. ఆ లిస్టులోకే వస్తాడు నాగార్జున అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే . నాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జున ..నాగార్జున తర్వాత నాగచైతన్య , అఖిల్ అంటూ తరతరాలుగా ఇండస్ట్రీని అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఏలేస్తున్నారు .
కాగా నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు కానీ తండ్రిగా మాత్రం ఫ్లాప్ అయ్యాడు అంటూ ట్రోలింగ్ జరుగుతుంది. దానికి కారణం నాగచైతన్య - అఖిల్ పెళ్లి విషయమే .నిశ్చితారధం చేసుకుని శ్రేయ భూపాల్ తో బ్రేకప్ చెప్పుకున్నాడు అఖిల్. పెళ్లి చేసుకుని సమంతతో విడాకులు తీసుకున్నాడు నాగచైతన్య . దొందు దొందే తండ్రి పెంపకం అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. అయితే నాగార్జునకి ఎప్పటినుంచో ఒక కోరిక అలాగే ఉండిపోయిందట. నాగార్జునకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం తన ఇంట్లో ఒక పాప పుట్టాలి అంటూ ఎంతగానో కోరుకున్నారట . కానీ నాగర్జునకు రెండుసార్లు కొడుకులే పుట్టారు. కనీసం నాగచైతన్యకి అఖిల్ కి పెళ్లయితే వాళ్లకైనా ఆడపిల్ల పుడుతుంది అంటూ ఆశపడ్డారట. నాగచైతన్యకు పెళ్లయిన అదృష్టం లేదు ..అఖిల్ కి అసలకే అదృష్టం లేదు. ఇలా నాగార్జున కోరిక ఇంకా తీరకుండా అలాగే మిగిలిపోయింది .చూద్దాం శోభిత ధూళిపాళ్ల ఆ నాగ్ కోరికను తీరుస్తుందేమో..??? అంటున్నారు అక్కినేని అభిమానులు..!!!