సౌత్ ఇండియన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. సినిమాల్లో మేకప్ లేకుండా తన సహజ అందంతో నటిస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ పై అభిమానం మరింత పెరిగింది.


అదేవిధంగా సాయి పల్లవి డాన్స్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలో దీపావళికి కనుగా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కు జంటగా నటించిన అమరాన్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగచైతన్యకు జంటగా తండేల్‌ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో వస్తున్న రామాయణం సినిమాలో కూడా సాయి పల్లవి సీతగా నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అయితే సాయి పల్లవి తన కెరీర్ లో ఇప్పటికే సౌత్ చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి హీరోలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఓ మలయాళ స్టార్ హీరో  మరోసారి రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. గతంలో సాయి పల్లవి దుల్కర్ కాంబినేషన్లో 2016లో కాళీ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాని తెలుగులో కూడా 2017 లో విడుదల చేశారు. కానీ తెలుగులో ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత దుల్కర్ కు జంటగా సాయి పల్ల నటించేందుకు ఓకే చెప్పినట్లులు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కూడా అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: