ఈ సంవత్సరం మన చిత్ర పరిశ్రమలో కొందరు స్టార్ సెలబ్రిటీ జంటలకు ఎంతో స్పెషల్  అని చెప్పాలి.. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ సెలబ్రెటీ జంటలు తల్లిదండ్రులు అయ్యారు.. వారి లైఫ్ లోకి పిల్లల్ని ఆహ్వానించిన ఆ పాపులర్ సెలబ్రిటీలు ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ దంపతులు ఈ సంవత్సరం తొలిసారి తల్లిదండ్రులు అయ్యారు.. ఈ సంవత్సరం సెప్టెంబర్ 8 తేదీన ఈ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది.. ఆ చిన్నారికి దువా పదుకొణ్  అనే పేరు పెట్టారు రన్బీర్ దీపికా . అలాగే మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఆయన భార్య నటాషా దలాల్‌ కూడా ఈ ఏడాదే తొలి సంతానాన్ని పొందారు. ఈ సంవత్సరం జూన్‌లో వరుణ్ ధావన్ కు ఓ పాప జన్మించింది.


అదే విధంగా మన టీమిండియా స్టార్ క్రికెటర్  విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు కూడా ఈ సంవత్సరం రెండో సంతానానికి జన్మనిచ్చారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన ఓ మగ బిడ్డకు అనుష్క జన్మనిచ్చారు. అలాగే మరో బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా కూడా ఈ సంవత్సరం అక్టోబర్లో తమ జీవితంలోకి పండంటి ఆడబిడ్డను ఆహ్వానించారు.అలాగే మ‌రో బాలీవుడ్ జంట రిచా ఛద్దా, అలీ ఫజల్ కూడా ఈ ఏడాదే తొలి సంతానం పొందారు. జూలై 16న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు రిచా. మ‌ర్ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్, ఆమె భర్త, ఫిల్మ్ మేకర్ ఆదిత్య ధార్ దంపతులు కూడా ఈ ఏడాది మే 10న వీరు తొలిసారి తల్లిదండ్రులు అయ్యారు.


అలాగే బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే, ఆయన భార్య, నటి శీతల్ ఠాకూర్ ఈ ఏడాది తొలిసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఓ కుమారుడిని వీరు పొందారు. ఇక పాపులర్ సింగర్ జస్టిన్ బీబర్, హైలీ బీబర్ ఈ ఏడాది కుమారుడిని ఆహ్వానించారు. ఈ ఏడాది ఆగస్టులో మగబిడ్డకు హైలీ జన్మనిచ్చారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, ఆయన భార్య పల్లవి ఈ ఏడాది తొలి సంతానాన్ని ఆహ్వానించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చారు పల్లవి. టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షితా రెడ్డి తల్లిదండ్రులు అయ్యారు. తమ కుమార్తెకు లీలా దేవి మైనేని అని పేరు పెట్టినట్టు ఈ ఏడాది మేలో వెల్లడించారు శర్వా. ఇలా ఈ 10 మంది స్టార్‌ సెలబ్రిటీల లైఫ్ లో ఈ సంవ‌త్స‌రం ఎంతో స్పెషల్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: