టాలీవుడ్ లో తెలుగు ఆమ్మాయిగా యంగ్ హీరోయిన్ గా పేరుపొందింది హీరోయిన్ చాందిని చౌదరి. కలర్ ఫోటో చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ ని అందుకోలేకపోతోంది. ప్రస్తుతం ఈ ఆమ్మడు సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంజీవరెడ్డి దర్శకత్వం వహించగా.. విక్రాంత్ హీరోగా నటిస్తూ ఉన్నారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయాగా అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. మరి ఆ పోస్ట్ గురించి పూర్తిగా చూద్దాం


ఇ పోస్టులో హలో ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో తాను కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను అంటూ తెలిపింది.అందుకు గల కారణం తాను రెండు నెలల క్రితమే తనకు ఒక తీవ్రమైన గాయం అయిందని అయితే దీనిపైన తనకు అవగాహన లేకపోవడం వల్ల ఈ గాయం చాలా తీవ్రంగా మారిపోయింది.. అయినప్పటికీ దానిని లెక్కచేయకుండా పలు రకాల షూటింగ్లలో పాల్గొన్నాను ..ఇప్పుడు బెడ్డుకే పరిమితం అయ్యేలా చేసింది అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది.


అందుకే నాకు ఇప్పుడు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.. కాబట్టి తాను కోల్పోవడానికి రెండు నెలల వరకు సమయం పడుతుందని వైద్యులు తెలియజేయడంతో ఆ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తున్నానంటూ తెలిపింది. అప్పటివరకు చిర్స్ అంటూ రాసుకుంది చాందిని చౌదరి.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇలా ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేయడంతో అభిమానులు కూడా చాందిని చౌదరి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనకు తగిలిన గాయం ఏంటి అందుకు సంబంధించిన విషయాలను మాత్రం చాందిని చౌదరి తెలియజేయలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: