విక్టరీ వెంకటేష్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా విజయ భాస్కర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మల్లీశ్వరి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , స్క్రీన్ ప్లే , మాటలను అందించాడు. మంచి అంచనాలను నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని వెంకటేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి విజయ్ భాస్కర్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాలో డైనింగ్ హాల్ సిన్ ఉంటుంది అది మన అందరికీ తెలిసిందే. ఈ సన్నివేశం వెంకటేష్ , బ్రహ్మానందం మధ్య ఉంటుంది. ఇక ఈ సన్నివేశం ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు విజయ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ డైనింగ్ హాల్ సన్నివేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా విజయ భాస్కర్ మాట్లాడుతూ ... మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ ఒక యువరాణి కాబట్టి ఆమె ప్యాలెస్ లో ఉంటుంది. దాని కోసం ఒక ప్యాలెస్ ను అద్దెకు తీసుకున్నాం.

ఇక అంత పెద్ద ప్యాలెస్ లో మల్లీశ్వరి సినిమాలో చూపించిన అంత పెద్ద డైనింగ్ టేబుల్ లేదు. కానీ మేము అందుకు సంబంధించిన సీన్ ఒక దాన్ని రాసుకున్నాం. దానితో దగ్గరుండి అంత పెద్ద డైనింగ్ టేబుల్ చేయించాం. ఆ తర్వాత ఆ సీన్ తీసాం అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలోని డైనింగ్ హాల్ టేబుల్ సేన్ కి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: