తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల లో నటించి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు . ఇకపోతే తలపతి విజయ్ కొంత కాలం క్రితమే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ మూవీ లో విజయ్ రెండు పాత్రలలో నటించాడు . ఒక పాత్ర లో తండ్రి గా , మరొక పాత్రలో కొడుకుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది . ఇకపోతే విజయ్ కొంత మంది కాలం క్రితమే ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ఈయన తలపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన పూర్తిగా రాజకీయాలకు టైమ్ కేటాయించనున్నట్లు సినిమాలు చేయకపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మరికొన్ని రోజుల్లోనే సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ వారు ఏకంగా 78 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: