ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో తెలుగు సినిమా అయినటువంటి క మూవీ కూడా ఇదే తేదీన విడుదల అయింది. ఈ మూవీ తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా అమరన్ , కన్నడ డబ్బింగ్ సినిమా భగీర కూడా ఇదే తేదీన విడుదల అయ్యాయి. ఇకపోతే భగీర మూవీ కి ఒక్క దానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు ప్రస్తుతం చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావడం లేదు.

ఇక లక్కీ భాస్కర్ , క , అమరన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. దానితో ఇప్పటికే అమరన్ మూవీ మొదటగా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోగా , క సినిమా నిన్నటితో బ్రేక్ ఈవేన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక లక్కీ భాస్కర్ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్న ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ జరగడంతో ఈ సినిమా ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేదు. ఇకపోతే ఇప్పటివరకు 5 రోజుల బాక్సాఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న లక్కీ భాస్కర్ ఐదు రోజుల్లో నైజాం ఏరియాలో 6.48 కోట్లు , సీడెడ్ లో 1.51 కోట్లు , ఆంధ్ర లో 4.79 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ మూవీ కి ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.78 కోట్ల షేర్ ... 20.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 15 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 2.22 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: