నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. అప్పటినుంచి ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
కేవలం 4 ఏళ్ళ సమయంలోనే వీరి వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరు విడాకులు తీసుకుని ఎవరికి వారుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమాయణం కొనసాగించాడు. ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట కొద్దిరోజుల్లోనే వివాహం చేసుకోబోతున్నారు. సమంత మాత్రం ఇప్పటికే సింగిల్గానే ఉంది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని ఎంతో ప్రేమించి నాగచైతన్యను వివాహం చేసుకున్నానని ఓ సందర్భంలో సమంత వెల్లడించింది. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన అనంతరం సమంత బాధలో ఉందట.
ఈ బాధతోనే ఇక హైదరాబాదులో ఉండకూడదని నిర్ణయించుకుందట. ఈ క్రమంలోనే హైదరాబాదులో తనకు సంబంధించిన ఆస్తులను సమంత అమ్ముకుంటున్నట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక త్వరలోనే సమంత ముంబై వెళ్లి అక్కడే ఉండాలని నిర్ణయించుకుందట. ముంబైలో సమంత ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.