సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంత రాద్ధాంతాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . చిన్న విషయాన్ని కూడా పెద్ద పెద్ద మాటలతో ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోస్ కూడా విడిపోయేంత రేంజ్ ట్రోలింగ్ జరుగుతుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా జరిగిన ట్రోలింగ్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా మెగా వర్సెస్ అల్లు వార్ అనే చెప్పాలి . అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ ఒంటరి చేసింది అని ఆ కారణంగానే పుష్ప2 సినిమాను పోస్ట్ పోన్ అయ్యేలా చేసింది అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


బన్నీ వైసీపీ కాండిడేట్ కు సపోర్ట్ చేయడం.. బన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోవడం.. జనసేన సూపర్ మెజారిటీతో గెలవడం ..బన్నీకి పెద్ద హెడేక్ గా మారిపోయింది . అంతేకాదు పలువురు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ బన్నీని దారుణంగా ట్రోల్ చేశారు . కొంతమంది ఫ్యామిలీని కూడా మధ్యలోకి లాగుతూ చాలా నీచంగా కూడా కామెంట్ చేశారు . అయితే బన్నీ ఏం మాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే పుష్ప2 ఆగస్టు 15 రిలీజ్ అవ్వాలి కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా ఆ సినిమాను డిసెంబర్  6 కి పోస్ట్ పోన్ చేశారు .  రీసెంట్గా పుష్ప టీం ప్రెస్ మీట్ పెట్టి మరి పుష్ప ఆరవ తేదీ కాదు ఐదవ తేదీ రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు.  ఇప్పుడు పుష్ప2 పైన బన్నీ అసలు పెట్టుకొని ఉన్నారు.



అయితే కావాలనే కొందరు బన్నీ పుష్ప2ను అడుక్కోవడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు బన్నీ అభిమానులు.  మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాపై బన్నీ కెరీర్  ఆధారపడింది అన్న విషయం అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే నిజంగానే బన్ని కెరీర్ చిక్కుల్లో పడిన్నట్లే.  ఈ సినిమా ఫ్లాప్ చేయడానికి కొందరు ఆకతాయిలు బాగా ప్రయత్నిస్తున్నారు. ముందు నుండే నెగిటివ్ టాక్ వచ్చేలా ట్రై చేస్తున్నారు బన్నీ హేటర్స్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.



ఎలాగైనా ఫ్లాప్ టాక్ తెప్పించే విధంగా ట్రై చేస్తున్నారట.  దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో మండిపడిపోతున్నారు . బన్నీ పై పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పుచ్చలు పేలిపోతాయి.  బన్నీ కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి . ఎదుటి వాళ్ళ సపోర్ట్ తో పైకి వచ్చిన మనిషి కాదు బన్నీ సినిమాలను మీరు గమనిస్తే అది ఈజీగా అర్థమవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: