మరీ ముఖ్యంగా తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో నటించేసింది. చిరంజీవి దగ్గర నుంచి నిన్న కాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన "సత్యదేవ్" వరకు అందరి యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని శభాష్ అనిపించుకుంది . తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . ఆ విషయాన్ని స్వయంగా ఇద్దరు కన్ఫామ్ చేశారు . కాగా త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త బాగా హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది.
సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా కూడా మారింది. ఇప్పుడే అప్పుడే పెళ్లి చేసుకోము అంటూ చాలా సందర్భాలలో చెప్పుకు వచ్చిన తమన్నా సడన్గా కుటుంబ సభ్యుల ఫోర్స్ చేస్తూ ఉన్న కారణంగా పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యిందట . పెళ్లికి ముందే ఇద్దరు చట్టపట్టాలేసుకొని తిరుగుతూ ఉండడంతో లేనిపోని రూమర్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కారణంగానే తమన్న ఇలాంటి నిర్ణయం తీసుకుందట . అంతేకాదు పెళ్లి ముహూర్త కూడా ఫిక్స్ చేసుకునేసిందట. త్వరలోనే తమన్నా- విజయ్ వర్మ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు అంటూ తెలుస్తుంది . దీనిపై తమన్న త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతుందట..!