వీళ్ళ నిశ్చితార్ధంలో వెంకటేష్ - జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ మిగతా సినీ ప్రముఖులు ఎలా సందడి చేశారో కూడా చూసాం. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ చిన్న కొడుకు వెంకటేష్ తో చేసిన అల్లరి మామూలుగా లేదు . దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది . అయితే నార్నే నితిన్ నిశ్చితార్థానికి వెంకటేష్ ఓ హీరోని ఇన్వైట్ చేసిన కూడా ఆయన ఫంక్షన్ కి హాజరు అవ్వలేదు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ మధ్యకాలంలో హీరోగా ఆయన సినిమాలు చేసింది లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులారిటీ దక్కించుకుంటూ వస్తున్నారు. పలు సినిమాలను ప్రమోట్ చేస్తూ ఈవెంట్స్ లో కూడా మెరుస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ అంటే మొదటి నుంచి కోపంగా ఉన్న ఆ హీరో ..ఎన్టీఆర్ ఆ ఫంక్షన్ కి హాజరవుతున్నాడు అని తెలిసే ఈ హీరో ఫంక్షన్ కి వెళ్లకుండా తప్పించుకున్నారట . వెంకటేష్ పదేపదే కాల్ చేసిన కూడా ఆయన అసలు రెస్పాండ్ అవ్వలేదట. వెంకటేష్ ఆ హీరో బాగా దగ్గర బంధువు కూడా అవుతాడు . దీంత్ఫ్ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నార్నే నితిన్ "మ్యాడ్" అనే సినిమాతో హీరోగా స్పెషల్ స్థానాన్ని దక్కించుకోవడానికి చాలా ట్రై చేసాడు . ఆ తర్వాత "ఆయ్" సినిమాలో నటించాడు. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఆయనకు అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది . ఇకపై ఇండస్ట్రీలో ఆయన హీరోగా సెటిల్ అవుతాడు అంటూ ఆశలు కూడా జనాలకి లేవు..!