మన తెలుగు చిత్ర పరిశ్రమ పేరు చెబితే చిరంజీవి పేరు వినిపించకుండా ఎవరు మాట్లాడలేరు.. తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్గా వెలుగుతున్న మెగాస్టార్ 150కు పైగా సినిమాల్లో నటించి తిరుగులేని  స్టార్ డం తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో వస్తూన్నాయి. అలాగే మల్టీస్టారర్ సినిమాలంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడతారు.. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ సినిమాను చూడడానికి ఫ్యాన్స్ ధియేటర్లు చుట్టూ క్యూ కడుతూ ఉంటారు. అలాగే మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ ఆ సినిమాను పొగుడుతూ ఉంటారు.


అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఇప్పటికే దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్ అందుకుని.. స్టార్ హీరోలకు తిరుగులేని సవాల్ విసిరాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో చిరంజీవి - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా థియేటర్లోకి రాలేదు మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ సినిమా చేయడానికి ఆవుల గిరి అనే నైజం డిస్ట్రిబ్యూటర్ ఈ మూవీ చేయడానికి సిద్ధమయ్యారట. చాలా మంది అగ్ర రైటర్లను కూర్చోబెట్టి స్టోరీ ని కూడా రెడీ చేయించారట.. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం అనుకున్నంత గొప్పగా అయితే రాలేకపోయింది.


అలాగే ఈ సినిమాను పక్క మాస్ సినిమాగా తీయాలనుకున్నారట.. కథ కూడా అనుకున్న విధంగా రాలేదట.. అలాగే వీళ్ళిద్దరినీ కలిపి సరైన ట్రాక్ లో పెట్టే దర్శకుడు దొరకపోవడంతో గిరి ఈ ప్రాజెక్టును పక్కన పడేశారు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు అయితే ఆ సినిమాలు వరుస‌ ప్లాప్ అవడంతో ఇండస్ట్రీ నుంచి ఆయన పక్కకు వెళ్లిపోయారు. ఒకవేళ గిరి చిరంజీవి - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తీసి ఉంటే మాత్రం అదిరిపోయే మల్టీస్టారర్ అయ్యుండేదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌ మరి రాబోయే రోజుల్లో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: