అలాగే కృష్ణ అమ్మ నాన్నలు కూడా శోభన్ బాబును వారి పెద్దబ్బాయిలా చూసేవారట . అలాగే కృష్ణ తొలి రోజుల్లో ఎక్కువగా శోభనబాబు ఇంట్లో ఉండేవారు .. ఇద్దరూ తమ కష్టసుఖాలు ఒకరినొకరు చెప్పుకొని జీవితంలో ముందుకు సాగే వారట . అయితే ఆ రోజుల్లో శోభన్ బాబు మరదలు ఆయన ఇంట్లోనే ఉండేదట .. అప్పుడప్పుడు కృష్ణ ఆమెతో మాట్లాడుతూ ఉండేవారట .. అయితే శోభన్ బాబు కి ఆయన మరదల్ని కృష్ణకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునే వారట .
ఇదే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ అమ్మ నాన్నలకు కూడా చెప్పారట . ఆ సమయంలో కృష్ణ అమ్మ గారు నా ఇంటికి వచ్చే కోడలు నా కొడుకు లాగా తెల్లగా ఉండాలి అని ఆయనతో చెప్పిందట. ఇలా నిజ జీవితంలో బంధువులుగా మారాల్సిన కృష్ణ - శోభన్ బాబుల ఆ సంబంధాన్ని ఆపింది కృష్ణ తల్లి అంటూ అప్పట్లో పలు వార్తలు కూడా వచ్చాయి . అయితే శోభన్ బాబు మరదల్ని కృష్ణ పెళ్లి చేసుకోకపోయినా కానీ వారిద్దరి మధ్య స్నేహం మాత్రం అస్సలు చెడిపోలేదట . మరణించే వరకు ఇద్దరు కలిసి ఉన్నారని తెలుస్తోంది.