సావిత్రి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.. ఆమె జీవితంలో ఎన్నో వైభోగాలు అనుభవించిన రోజులు ఉన్నాయి..తిండి లేకుండా దరిద్రపు రోజుల్లో బతికిన రోజులు ఉన్నాయి. అలా ఈమె జీవితం ఎంతోమందికి గుణపాఠంగా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి సావిత్రి పై ఓ రాజకీయ నాయకుడు మోజుపడి ఆమె ఒప్పుకోలేదనే కోపంతో చివరికి ఆమె జీవితాన్ని ఎటూ కాకుండా చేశారట. మరి ఇంతకీ ఆయన ఎవరు అనేది చూస్తే.. సావిత్రి పెళ్లయిన జెమినీ గణేషన్ ని పెళ్లయింది అనే విషయం   తెలిసి  కూడా చేసుకుంది. అయితే జెమిని గణేషన్ కు పెళ్లయిన విషయం తెలియక ముందే ప్రేమించింది. కానీ పెళ్లయిన విషయం తెలిసాక కొద్దిరోజులు దూరం పెట్టినప్పటికీ మళ్లీ కలుసుకున్నారు.అలా సావిత్రి జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల వరకు బాగానే ఉంది.

కానీ పిల్లలు పుట్టాకే అసలు గొడవలు మొదలయ్యాయి.చివరికి గొడవలతో భర్తను కూడా వదిలి పెట్టేసి సావిత్రి బయటికి వచ్చేసింది. అలా తన పిల్లల్ని చూసుకొని మురిసిపోయింది. కానీ నా అన్న వాళ్లే సావిత్రిని మోసం చేసి ఆమె జీవితం నాశనం చేశారు. ముఖ్యంగా సావిత్రి తన భర్తకు దూరమైంది అనే విషయం తెలుసుకున్న ఓ రాజకీయ నాయకుడు సావిత్రి పై మోజుపడి ఆమెని ఎలాగైనా అనుభవించాలి అనుకున్నారట. కానీ సావిత్రి మాత్రం దానికి ఒప్పుకోలేదట.

దాంతో పగబట్టిన రాజకీయ నాయకుడు సావిత్రి పై కోపంతో ఆమెకు ఉన్న కోట్ల ఆస్తి మీద కన్నేసి ఐటి రైడ్ చేపించి చివరికి ఆస్తులు అన్ని జప్తు అయ్యేలా చేశాడు.అలా ఆస్తులన్నీ పోయాక సావిత్రి ఎంత పేదరికంలో బతికిందో ఎంత దరిద్రపు జీవితాన్ని అనుభవించిందో చెప్పనక్కర్లేదు. అలా తనని కాదంది అనే ఒకే ఒక్క కారణంతో  సావిత్రి కోట్ల ఆస్తి మొత్తాన్ని పోయేలా చేశాడు అంటూ ఈ విషయాన్ని సావిత్రి దగ్గర పని చేసిన సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: