అయితే ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ 5 నిమిషాల పాట కోసం ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అడగడంతో ఇది వర్కౌట్ కాదని భావించిన చిత్ర బృందం హీరోయిన్ శ్రీలీలని కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ కి కూడా నార్త్ లో మంచి క్రేజ్ ఉన్నది. దీంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చిత్రబృందం ప్రయత్నించినప్పటికీ ఆ ఫలితం విఫలమయ్యింది.
పుష్ప-2 సినిమా డిసెంబర్ 6వ తేదీన పాన్ ఇండియాలెవల్లో రిలీజ్ చేయవలసి ఉండగా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ఐదవ తేదీని రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే పుష్ప-2 సినిమా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇందులో థియేటర్ బిజినెస్ 600 కోట్లు ఉండగా నాన్ థియెట్రికల్ బిజినెస్ 400 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. పుష్ప-2 చిత్రానికి అన్ని భాషలలో కూడా భారీగానే డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి మొత్తానికి పుష్ప-2 సినిమా ఈ ఏడాదంతా ఈ సినిమా హవానే కనిపిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం అయితే శ్రద్ధా కపూర్ రెమ్యూనరేషన్ వైరల్ గా మారుతున్నది.