బీహార్ ప్రాంతానికి చెందిన గాయని శారదా సిన్హా కొన్ని వందల పాటలు పాడారు. ఎన్నో చిత్రాలలో కూడా పాటలు పాడి భారీ పాపులారిటీ అందుకున్నది.ఈమె పాడిన జానపద గీతాలు ప్రతి వేడుకలలో కూడా ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. భోజ్ పూరి చిత్రాలలో కూడా ఈమె పాటలు పాడడం జరిగిందట. అందుకే భోజపురి పాటలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తూ ఉండేది.. ఇమే చేసిన సేవలను సైతం దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నది.. 2017లో ఈమె క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలుస్తోంది.


దీంతో గాయని శారదా సిన్హా ఆరోగ్యం అప్పటి నుంచి చాలా దెబ్బతిందట. గత నెల 25వ తేదీన ఢిల్లీలో ఎయిమ్స్ అంకాలజీ విభాగంలో అడ్మిట్ అయినప్పటికీ వెంటి లెటర్ పైన చికిత్స అందిస్తూ ఉన్నారట. అక్కడ అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయించినప్పటికీ ఈమె మంగళవారం రోజున రాత్రి తుది శ్వాస విడిచినట్లు సమాచారం. గాయని శారద మృతి విషయం తెలియగానే ఆమె అభిమానులు పలువురు సినీ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కోకిల మూగ పోయింది అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


శారద సిన్హా భోజ్ పురి భాషలలో ఎన్నో ఏళ్లుగా కొన్ని వందలాది పాటలను పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అక్కడ ఛత్ పూజల పాటలతో ఈమె అలరిస్తూ ఉండేదట. ఈమె మృతి పట్ల పలువురు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా తదితర నేతలు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. శారద వయసు 72 సంవత్సరాలట.. గత కొద్దిరోజులుగా ఇమే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మరి ఈమె అంత్యక్రియలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇప్పటివరకు తెలియలేదు. వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: