దగ్గుబాటి రానాకి స్టేజ్ మీదే అంత పెద్ద అవమానం జరిగిందా? ఇంతకీ రానాని అవమానించిన ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఆయన్ని అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా దుబాయ్ లో ఐఫా అవార్డ్స్ వేడుక జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి హోస్ట్ గా దగ్గుబాటి రానా చేశారు.అయితే రానా కేవలం హీరో గానే కాదు పలు షో లకు వ్యాఖ్యతగా చేసిన అనుభవం ఉండడంతో ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్లకు ఈయన హోస్ట్ గా చేస్తూ ఉంటారు. అలా దుబాయ్ లోని అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకలో హోస్ట్ గా రానా తన మాటలతో అలరించారు. 

అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రానా పై ఓ హీరోయిన్ చేసిన కామెంట్లకి అక్కడున్న వాళ్ళందరూ ఫక్కున నవ్వేశారు. ఇక ఈ మాటలు కాస్త రానా పరువు తీసినట్టుగా ఉన్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే వరలక్ష్మి శరత్ కుమార్.. వరలక్ష్మి శరత్ కుమార్ కి ఉత్తమ సహాయ నటిగా ఐఫా అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదికి వచ్చిన సమయంలో రానా వరలక్ష్మి శరత్ కుమార్ ని మీరు మీ పెళ్లికి ప్రతి ఒక్కరిని పిలిచారు. కానీ నన్ను మాత్రం పిలవలేదు అని అడిగారు. దానికి వరలక్ష్మి మీరు నన్ను పిలవలేదు కాబట్టే నేను కూడా మిమ్మల్ని పిలవలేదు అని చెప్పింది.


 నేనంటే కరోనా టైంలో చేసుకున్నాను  అని రానా అనడంతో అయినా మిమ్మల్ని ఎందుకు పిలవాలి అంటూ మాట్లాడింది.అయితే వరలక్ష్మి ఫన్నీ గానే మాట్లాడినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేసరికి రానాకి కాస్త అవమానం జరిగిందని సోషల్ మీడియాలో రానా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అంత పెద్ద స్టేజ్ మీద మిమ్మల్ని ఎందుకు పిలవాలి అంటూ రానా గాలి మొత్తం తీసేసి ఆయన్ని  అవమానిస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.వరలక్ష్మి శరత్ కుమార్ రానా పరువు మొత్తం తీసేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: