విషయంలోకి వెళితే, సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ రెడ్డిట్‌లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని, అతని పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఎందుకు మార్చివేసారో ఆ దేవుడికి, సల్మాన్ ఖాన్ కి మాత్రమే తెలుసని.. కావాలంటే ఎవ్వరైనా వారిని ప్రశ్నించండి! అంటూ ఆమె రాసుకొచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు గురించి అడిగిన సందర్భంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్‌లకు న్యాయం జరగాలి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్ మరణం ఓ మిస్టరీ. రాజ్‌పుత్ తన నివాసంలో శవంగా కనిపించాడు. ఏయిమ్స్ డాక్టర్ బోర్డు దీనిని ఆత్మహత్యగా చెప్పింది. హత్య ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఇది చాలా దారుణం. విషయం ఏమిటంటే, ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా.. సుశాంత్ సింగ్ మరణానికి ఉరి వేసుకోవడమే కారణమని, అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేల్చేసాడు. ఇది పచ్చి అబద్ధం. నటి జియా ఖాన్ గర్భవతిగా ఉన్న సమయంలో ఉరేసుకుని కనిపించిందని, ఆమె మరణం తర్వాత సల్మాన్ ఖాన్‌ని సూరజ్ పంచోలి సలహాలు కోరాడని సోమీ అలీ ఈ సందర్భంగా ఆరోపించారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కన్నా సీరియల్ కిల్లర్ టెడ్ బండీ ఎంతో నయమని ఆమె ఆరోపించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.