తన నటన, అందం, అభినయం, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో సమంతకు పోటీగా ఎంతో మంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇండస్ట్రీలో సమంతకు ఎంతోమంది హీరోయిన్లతో మంచి అనుబంధం ఉంది. సమంత ప్రతి ఒక్క హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అందువల్ల సమంతను ప్రతి ఒక్క హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటుంది.
అందులో సమంత, త్రిష కృష్ణన్ సినీ పరిశ్రమలోనే మంచి స్నేహితులు. వారిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. వారిద్దరి స్నేహబంధం బయట కూడా చాలా సార్లు చూసాం. వారి స్నేహాన్ని చాలామంది ప్రశంసించారు. అంతేకాదు త్రిష, సమంత చాలాసార్లు వెకేషన్స్ కి కూడా వెళ్లారట. ఒకే రూమ్ లో కలిసి ఇద్దరూ ఉండేవారట.
ఒకే హోటల్ లో ఒకే రూం తీసుకుని.. నైట్ టైంలో చిల్ అయ్యేవారట. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో వారు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల బయటకు వెళ్లలేకపోతున్నారట. ఇది ఇలా ఉండగా.... సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిష కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. వయసు పెరిగినప్పటికీ త్రిష అందం, క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అటు తమిళ్ హీరో విజయ్ తో ఇప్పటికీ.. త్రిష రిలేషన్ లో ఉందని చెబుతున్నారు.