గీత ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తండేల్ మూవీ మేకర్స్ ప్రెస్ మెట్ పెట్టి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఈవెంట్ కు సాయి పల్లవి హాజరవడంతో ఆమె అభిమానులు పండగ చేసుకున్నారు. కాగా ఈ ఈవెంట్లో సాయి పల్లవి గురించి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "మొన్ననే అమరన్ సినిమా చూసాను. బయటకు వచ్చేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆఖరున సాయి పల్లవి అయితే అందర్నీ ఏడిపించేసింది. ఆ ఎమోషన్ లోనే సాయి పల్లవితో మాట్లాడాలని బయటకు రాగానే ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. నేను ఆమెను ఎప్పుడూ ఒక కూతురులా భావిస్తాను. నాకే గనక కూతురు ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది!" అని అన్నారు. ఈ వేదికపై అమరన్ సక్సెస్ అయినందుకు సాయి పల్లవిని అల్లు అరవింద్, తండేల్ యూనిట్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. దీంతో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ మాటలు విన్న అల్లు ఆర్మీ... కూతురు వంటిదని ఫీల్ అవుతున్నారు కాబట్టేనా, మా అన్న అల్లు అర్జున్ తో ఆమె సినిమాలు చేయడం లేదు? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏమిటో ఇక్కడ తెలియజేయండి!