చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎదగాలంటే ఎన్నోకష్టాలు చూడాల్సి వస్తుంది .. అలాగే అవమానాలు , సవాళ్లు సహించి అవకాశాలు అందుకుని తమను తాము నిరూపించుకోవాలి.. అలా కొందరు విజయం సాధిస్తే మరికొందరు మధ్యలోనే వెను తిరిగి వెళ్ళిపోతున్నారు .. అలానే సినిమాల్లో సక్సెస్ అయి తర్వాత అవకాశాలు తగ్గటంతో చాలా మంది హీరోయిన్లు ఇతర రంగాల్లో కూడా అడుగుపెడుతున్నారు. చాలా మంది ఇతర త‌మ కేరీర్‌లో మార్గాలను ఎంచుకున్నారు.. ఒకప్పుడు  బాలీవుడ్ లో చక్రం తిప్పిన హీరోయిన్ మయూరి కాంగో కూడా ప్రస్తుతం సినిమాలను వదిలిపెట్టి గూగుల్లో తన కెరియర్ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.


గతంలో హిందీలో పాపులర్ సాంగ్స్ ‘పాపా కెహ్తే హై’ , ‘ఘర్ సే నిక్లాతే హై’ పాటలతో ఎంతో ఫేమస్ అయిన మయూరి కాంగో సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంది. 2000 లో విడుదలైన వంశీ ఆమె చివరి సినిమా ....ఆమె నర్గీస్, తోడ గమ్ తోడ ఖుషి, డాలర్ బాబు, కిట్టి పార్టీ వంటి  పలు టెలివిజన్ షోల్లో కూడా నటించింది. 2003లో ఆమె చిత్ర పరిశ్రమను వదిలిపెట్టి తన భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది.. అక్కడే బిజినెస్ చేస్తూ స్థిరపడింది.. అయితే 2004 - 12 మధ్యకాలంలో ఆమె తన జీవితంలో కొత్త రంగంలో అడుగుపెట్టింది.. ఐఐటీ ప్రవేశ పరీక్షల కూడా ఉత్తీర్ణ సాధించింది. ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ కూడా వచ్చింది, కానీ ఆ సమయంలో ఆమె నటనను కొనసాగించడానికి ఇష్టపడింది. 2013లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మయూరి పెర్‌ఫార్మిక్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.


అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె గూగుల్ ఇండియాలో జాయిన్ అయింది.. 2019లో ఆమె అనుకోని విజయం అందుకుంది కొన్ని సంవత్సరాల పాటు గూగుల్ ఇండియాలో పని చేసింది.. చిత్ర పరిశ్రమ నుంచి సాంకేతిక ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో విజయాలు అందుతుంది. అలాగే రీసెంట్గా గూగుల్ ఇండియా ఇండస్ట్రీకి హెడ్గా నటి మయూరి కాంగో మారారు.. మయూరి కాంగో కమ్యూనిస్టు నాయకుడు బాలచందర్ కాంగో కుమార్తె. ఆమె ‘పాపా కెహతే హై’, ‘హోగీ ప్యార్ కీ జీత్’ వంటి సినిమాల్లో నటించింది. మయూరి డిసెంబర్ 2003లో ఔరంగాబాద్‌లో ఎన్నారై ఆదిత్య ధిల్లాన్‌ను వివాహం చేసుకుంది. మయూరి, ఆదిత్య మొదట ఒక పార్టీలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు.  అలా చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకపోయినా సాంకేతిక రంగంలో మయూరి కాంగో ఎవరు ఊహించని స్థాయిలో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: