తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రభాస్ ఇప్పుడు మొత్తంగా ఇండియన్ సినిమాకే కింగ్ మేకర్ గా మారాడు. బాలీవుడ్ పై పగబట్టి కసితో సినిమాలు చేస్తున్నాడు. ఏకంగా ఇప్పుడు ఐదు భారీ సినిమాలను లైన్లో పెట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. దీంతో బాలీవుడ్ హీరోలు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. ఏ రూపంలో ప్రభాస్ విరుచుకుపడతాడు అనే తెలియక భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే తన సినిమాల గురించి వచ్చే అప్డేట్లతో ప్రభాస్ బాలీవుడ్ ను ఐసీయులో పేషెంట్‌గా మార్చేశాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.. రాజాసాబ్, ఫౌజీ, కల్కీ 2, సలార్ 2, స్పిరిట్.. ఇక వీటిలో రాజాసాబ్ , పౌజి సినిమాలు వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. అలాగే కల్కి 2027లో రానుంది.. సలార్ 2ను ప్రశాంత్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత కూల్ గా మొదలు పెడతాడు .. వీటితో పాటు స్పిరిట్ కూడా మధ్యలో రానుంది ..
అయితే ఇప్పుడు స్పిరిట్ నుంచి ఒక క్రేజీ న్యూస్ బాలీవుడ్ హీరోల కుసాలను విరగగొట్టింది.. స్పిరిట్ ను యానిమల్ పార్క్‌తో లింక్ చేసే ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో ఎవరు ఊహించని సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాను స్పిరిట్ తో లింక్ చేయడం వెనుక ప్లాన్ ఏంటీ అనేది క్లారిటీ రావడం లేదు. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గాకనిపించబోడున్నడు. మరి యానిమల్ పార్క్ తో లింక్ చేసి ఆ కాంబినేషన్ ఏ రేంజ్ లో సెట్ చేస్తాడో అర్ధం కాని పరిస్థితి. సందీప్ రెడ్డి వంగా చేతిలో కూడా నాలుగు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో యానిమల్ 2 ఒకటి . మరి యానిమల్ కంటిన్యూషన్ గా స్పిరిట్ ఉంటుందా లేదంటే లోకేష్ కనగరాజ్ సినిమాల లెవెల్ లో ప్లాన్ చేసాడా అనేది చూడాలి .