ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంటే ఆ మూవీ కోసం హీరోలు ఎన్నో కష్టాలు బాధలు దిగ మింగి సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అయితే ఈ విషయంలో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అంతే..ఎన్నో రిస్కులు చేసి కొన్ని పాత్రలు కూడా ఆయన కెరియర్ లో నటించాడు ప్రభాస్. వాటి కారణంగా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యాయి.. అలాగే కొన్నిసార్లు సర్జరీలు కూడా చేయించుకున్నారట. అయితే ఈ విషయాన్ని పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎక్కడా చెప్పలేదు.. ఇంతకీ ఈ వార్త చెప్పింది మరి ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
గతంలో జరిగిన ఓ ఈవెంట్లో సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తూ.. ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్.. అక్కడ మాట్లాడుతూ సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడతారో వివరించారు. కొన్ని రిస్కీ షాట్స్ తీస్తాము ఆ సమయంలో ఒక్కోసారి ఇంజ్యూరీస్ కూడా అవుతూ ఉంటాయి. వాటి కారణంగా హీరోల లైఫ్ లో పలు రిస్కులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా సరే సినిమా కోసం వాటన్నిటిని భరిస్తూ ఉంటారు.. అలాగే ప్రభాస్ గురించి నాకు తెలుసు ఆయనకు రెండు సర్జరీలు అయ్యాయి.. ఆయన రెండు భుజాలకు సర్జరీలు జరిగాయి.. అయినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తెల్లారే ఆ బాధను మర్చిపోయి షూటింగ్స్ కోసం వస్తుంటాము ఇదంతా అభిమానుల కోసమే అని చెబుతూ ఆవేదన చెందారూ రామ్ చరణ్ ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.