ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పెళ్లి ముహూర్తం ఎంతలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా నాగచైతన్య తన పెళ్లికి సంబంధించి ఎటువంటి విషయాని కూడా సోషల్ మీడియా వేదికగా అసలు అనౌన్స్ చేయడం లేదు . శోభిత మాత్రం తన పెళ్లి పనులను చకచకా కంప్లీట్ చేసేస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నాగచైతన్యకి సంబంధించిన పలు  రకాల వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి . తాజాగా నాగచైతన్య నటిస్తున్న "తండేల్" సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు .


అక్కినేని హీరో నాగ చైతన్య అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం మేకర్స్ హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూ సమాధానం చెప్పారు . ఇక ఈ ఈవెంట్లో నాగచైతన్య పరోక్షంగా తన పెళ్లి డేట్ ను రివిల్ చేసినట్లయింది. ఈ సినిమాను ఫిబ్రవరి 7 రిలీజ్ చేస్తున్నట్లు కొత్త పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు మూవీ టీం . అయితే నిజానికి ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అని భావించారు.  అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమాని  సంక్రాంతి బరిలో నిలిపేందుకు చాలా చాలా ప్రయత్నించారు.



కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమాను ఫిబ్రవరి 7కి పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు . అయితే సంక్రాంతి రేసులో బడాబడా సినిమాలు ఉండడంతో నాగచైతన్య ఆ స్పీడ్ తట్టుకోలేడు అన్న కారణంగానే మేకర్స్  ఇలా తప్పుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.  కానీ సోషల్ మీడియాలో మాత్రం దీని వర్షన్ వేరేలా ఉంది.  డిసెంబర్ 4 నాగచైతన్య శోభితల పెళ్లి జరగబోతున్నందు కారణంగా ఆయన తర్వాత కొన్ని నెలల పాటు బిజీ అవుతాడు అని ..అప్పుడు ఆయన తండెల్ మూవీ కోసం ఎటువంటి డేట్స్ అడ్జస్ట్ చేయడు అని ఆ కారణంగానే ఈయన సినిమా ఫిబ్రవరి 7 కి పోస్ట్ పోన్ చేస్తూ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పుకొస్తున్నారు. పెళ్లి తర్వాత కచ్చితంగా నాగచైతన్య హనీమూన్ అంటూ రెండు మూడు వారాలు గడిపేస్తాడు. ఆ తర్వాత తండేఅల్ ప్రమోషన్స్ కోసం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా తంటాలు పడాలి.. అందుకే ఏ దిగులు లేకుండా ఫిబ్రవరి 7న ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేశారట మేకర్స్ . ఇలా పరోక్షకంగా డిసెంబర్ 4 ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు అనఫిషియల్ గానే కన్ ఫామ్ చేసేసింది మూవీ టీం..!

మరింత సమాచారం తెలుసుకోండి: