ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ మరీ ఓవర్ చేసేస్తున్నారు. ఎంతలా అంటే తమ స్టార్ హీరోస్ తమ ఫేవరెట్ హీరోయిన్ నే సినిమాల్లో తీసుకోవాలి అని ..అదేవిధంగా బడాబడా కంటెంట్ ఉన్న సినిమాలలోనే నటించాలి అని.. వేరే సినిమాలలో గెస్ట్ పాత్రలో కనిపించకూడదని ..చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు . ఒకప్పుడు పరిస్థితి వేరు . స్టార్ హీరోలు ఎలాంటి సినిమాలో నటిస్తే అలాంటి సినిమాలనే చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఫ్యాన్స్.  కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది . ఫ్యాన్స్ డిమాండ్ ప్రకారం..  పాన్  ఇండియా సినిమాలనే హీరోలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ "తండేల్".


ఈ సినిమాలో మలయాళీ కుట్టి అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.  హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కి పలువురు మీడియా మిత్రులు కూడా హాజరై తండేల్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వేసి మంచి మంచి విషయాలను తెలుసుకున్నారు.  ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం.



కాగా ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు స్టేజిపై చేసిన కామెంట్స్ మాత్రం హైలెట్గా మారాయి . జనరల్ గా బన్నీ వాసు ఎక్కడ కూడా అంత పెద్దగా స్పీచ్ ఇవ్వరు మాట్లాడరు. మాట్లాడిన నాలుగు ముక్కలు కూడా చక్కగా మాట్లాడుతాడు . ఈ ప్రెస్ మీట్ లో సైతం అలాగే మాట్లాడాడు. "అక్కినేని అభిమానులు అందరికీ ఒక్కే ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ..ఫిబ్రవరి 6వ తారీఖు సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్లి మంచి మంచి షర్ట్స్ కొనుకోండి ఎందుకంటే కచ్చితంగా ఆ పక్క రోజు తండేల్ సినిమా రిలీజ్ అవుతుంది.మీరు కచ్చితంగా కాలర్ ఎగరేసి .. గర్వంగా ఇది మా నాగచైతన్య సినిమా అని చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది . మేము అలాంటి ఒక మంచి స్టోరీని డెలివరీ చేస్తున్నాము" అంటూ తెలిపాడు . దీనిపై పలువురు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. ఫన్ని ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇది మా అన్న డైలాగ్ ..ఎన్టీఆర్ కాలర్ డైలాగ్ బాగానే వాడేసి సినిమాకి ప్రమోషన్ నిర్వహించుకుంటున్నావే అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాం అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: