సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోతో చేయాలి అనుకున్న సినిమాను మరొకరితో చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక హీరో దగ్గరికి వచ్చిన కథను ఎవరైతే రిజెక్ట్ చేస్తారో ఆ తర్వాత ఆ మూవీ విడుదల అయ్యాక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే ఎందుకు ఆ సినిమాను ఆ రోజు రిజెక్ట్ చేసామా అని హీరోలు బాధపడడం , అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే ఆ సినిమాను ఆ రోజు వదులుకొని చాలా మంచి పని చేసాం అని ఆనంద పడటం జరగడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో వెంకటేష్ , నాగార్జున కూడా ఉంటారు. ఇకపోతే వెంకటేష్ తన దగ్గరకు వచ్చిన ఒక కథను రిజెక్ట్ చేయగా అందులో నాగార్జున నటించగా అది బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏది ..? అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో సంతోషం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా నాగార్జున , దశరథ్ ఇద్దరికీ కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ ని మొదట వెంకటేష్ తో చేయాలి అని దశరథ్ అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించాడట. కథ మొత్తం విన్న వెంకటేష్ స్టోరీ సూపర్ గా ఉంది. కానీ ప్రస్తుతం నేను వేరే సినిమాలకి కమిట్ అయ్యాను. ఆ సినిమాలు పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. అందుకే నువ్వు ఈ కథతో వేరే హీరోతో సినిమా చెయ్యి అని చెప్పాడట. ఇక దానితో దశరథ్ , నాగార్జునకు ఈ మూవీ కథను వినిపించగా , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషం అనే టైటిల్ తో మూవీ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే సంతోషం మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: