మెగాస్టార్ చిరంజీవి చేసిన 'శంకర్ దాదా MBBS' సినిమా గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో సంజయ్ దత్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో తెరకెక్కిన 'మున్నా భాయ్ MBBS' చిత్రానికి ఇది రీమేక్ అయినప్పటికీ, మాతృక కంటే అద్భుతంగా ఆడింది. ఎందుకంటే, ఈ సినిమాలో సంజయ్ దత్ కామెడీ టైమింగ్ కంటే, మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘అంజి’ వంటి సీరియస్ మూవీస్ తర్వాత, మెగాస్టార్ నుండి వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చూసి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ ఈ సినిమాని ఒరిజినల్ కంటే కూడా బాగా తీయడంతో మంచి మార్కులే కొట్టేశాడు. ఆరోజుల్లోనే ఈ సినిమా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.

ఇక ఈ సినిమా ఇప్పటికీ తెలుగువారికి ఇష్టమైన సినిమాల లిస్టులో ఉంటుంది అనడంలో  అతిశయోక్తి లేదు. అందుకే ఈ సినిమాలోని చిరంజీవితో పాటు ఆయనతో కలిసి నటించిన నటులు కూడా జనాలకి బాగా గుర్తుంటారు. ఎందుకంటే ఆయా నటులు కూడా తమ పాత్రల్లో తాము జీవించేసారు. ముఖ్యంగా చిరంజీవి తండ్రి పాత్ర పోషించిన వ్యక్తిని అంత తేలికగా మరచిపోవడం కష్టం. చాలా హుందాతనంతో, పెద్ద మనిషిగా ఆయన తన పాత్రలో జీవించేసాడు. ఆయన పేరు గిరీష్ కర్నాద్. ఈయన ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప రచయత, డైరెక్టర్ కూడా. కన్నడ , హిందీ, తెలుగు, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో ఆయన తన అద్భుతమైన ప్రతిభ చూపించి అన్ని విభాగాల్లో గొప్పగా రాణించాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే, నటుడు గిరీష్ కి రఘు కర్నాద్ అనే కొడుకు, షల్మాలి రాధ కర్నాద్ అనే కూతురు ఉన్నారు. కొడుకు కూడా తండ్రి బాటలో గొప్ప రచయితగా స్థిరపడ్డాడు. విదేశాల్లో ఎన్నో ప్రముఖ సంస్థల్లో ఆయన జర్నలిస్ట్ గా కొనసాగుతున్నాడు కూడా. ఇక గిరీష్ కూతురు షల్మాలి విషయానికి వస్తే, ఈమె డాక్టర్ చదివి సౌత్ ఆఫ్రికా లో ‘విమెన్ లిఫ్ట్ హెల్త్’ అనే సంస్థకి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎన్నో అద్భుతమైన సేవ కార్యక్రమాలు చేపడుతోంది. షల్మాలి మానవత్వం ఉన్న అమ్మాయిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు గడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: