మెగాస్టార్ ..ఏ సినిమాకి అయినా సరే రివ్యూ ఇస్తాడు . అది కచ్చితంగా సూపర్ డూపర్ గా ఉంటుంది.  సినిమా బాగుంది అంటే బాగుంది అని చెప్తారు . బాగోలేకపోతే ఇంకా బెటర్ గా వర్క్ చేస్తే బాగుంటుందేమో అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అంతేకానీ బాగోలేని సినిమాని బాగుంది అంటూ డప్పు కొట్టుకుంటూ తిరగడు. అయితే చిరంజీవి అందరి విషయాలలో ఒకేలా ఉంటారు. రాంచరణ్ విషయంలో కూడా అలాగే ప్రవర్తించారు. రామ్ చరణ్ నటించిన ఒక సినిమా చిరంజీవికి అస్సలు నచ్చలేదట . ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేసాడు .


స్టేజిపై కూడా పలు సందర్భాలలో ఈ విషయాన్ని గుర్తు చేశాడు. ఆ సినిమా మరేదో కాదు "ఆరెంజ్". బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు.  అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి వేరేలా ఉండింది. లవర్ బాయ్ గా చరణ్ పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ అసలు స్టోరీ ఏంటో జనాలు అర్థం కాలేకపోయింది. భాస్కర్ కూడా ఆ విషయాన్ని జనాలకు తెలియజేయడంలో తడబడ్డారు . ఫలితంగా సినిమా ఫ్లాప్ అయింది .



ఈ సినిమాకి పెట్టిన డబ్బులు మొత్తం లాస్ వచ్చేసింది . నాగబాబు ఫైనాన్షియల్ కి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. కాగా ఈ సినిమాపై చిరంజీవి సైతం నెగిటివ్ రివ్యూ ని ఇచ్చారట . "చరణ్ యాక్టింగ్ పరంగా ఓకే కానీ ఇంకా స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోవాలి అని.. మరి ముఖ్యంగా నాటి ఫెలో అంటే అల్లరి చిల్లరగా కనిపించడం కాదు.. బాధ్యతగా కూడా ఉండడం ..ఎక్స్ప్రెషన్స్ హవ భావాలు ఇంకా బాగా పలికించాలి.. కథ బాగో లేకపోయినా మన నటనతో సినిమాని హిట్ చేసే అంత టాలెంట్ రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతారు ..ఎదగగలరు ..ఆ స్థానాన్ని పదిలంగా ఉంచుకోగలరు " అంటూ చెప్పుకు వచ్చారట. ఆ తర్వాత చరణ్ ని బాగా మోల్టప్ చేశాడు చిరంజీవి. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాలలో ఆయన నెగటివ్స్ ని పాజిటివ్ గా మార్చుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: