కెరీర్ ప్రారంభంలో సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత సినిమాల్లో నటిస్తు సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో అలా సక్సెస్ అయిన వారి గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇలా ఈయన దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వైపు కాకుండా నటన వైపు ఫోకస్ పెట్టడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం తరుణ్ భాస్కర్ "కీడా కోలా" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఈ మూవీ తన మొదటి రెండు సినిమాల స్థాయి విజయాలను అందుకోలేదు. 

ఇక కంచరపాలెం , ఉమా పరమేశ్వర ఉగ్రరూపస్యహ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ మహా కూడా ఈ మధ్య కాలంలో దర్శకత్వం అంటే కూడా సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్ మహా కొన్ని సినిమాల్లో నటించి నటుడుగా కూడా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎస్ జె సూర్య కూడా ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: