మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మట్కా మూవీ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. 1960 వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ ఇది.. రతన్ ఖాత్రి జీవితంలో జరిగిన ఘటనలు స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నానని దర్శకుడు కరుణకుమార్ చెప్పారు .. ఇంతకీ ఎవరు ఈ రతన్ ఖాత్రి ? అనే ప్రశ్నలు సహజంగానే అందరిలో వస్తాయి.. అయితే రతన్ ఖాత్రి అనడం కంటే మట్కా కింగ్ రతన్ ఖాత్రీగా చాలా మందికి తెలుసు .. గాంబ్లింగ్ ప్రపంచంలో రతన్ ఖాత్రికి ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


పాకిస్తాన్ కరాచీలో జన్మించిన ఆయన మన దేశ విభజన తర్వాత ఇండియాకి వచ్చాడు. 1962లో ముంబై కేంద్రంగా మట్కా గాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేశాడు. ఖాత్రి ముందుగా మరో మట్కా కింగ్ కళ్యాణ్‌జీ భగత్ తో కలిసి పని చేశాడు.. ఆ తర్వాత రతన్ మట్కా తానే తన సొంత ఆపరేషన్ మొదలు పెట్టాడు. ఇక అతని నెట్వర్క్ సెలబ్రిటీలను సైతం ఎంతో ఆకర్షించింది. చాలా కాలం పాటు గ్యాంబ్లింగ్ లో కింగ్ మేకర్ గా ఉన్న‌డు. అలాగే ఎమర్జెన్సీ టైంలో జైలు జీవితం కూడా అనుభవించాడు.


ఖాత్రీ గ్యాంబ్లింగ్ టెక్నిక్ లో మట్కా, ప్లేయింగ్ కార్డ్స్ లో తనకి ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టాయి. టెక్నాలజీ సెల్ ఫోన్స్ , ఇంటర్నెట్ లేని రోజుల్లోనే దేశం మొత్తం అతను నడిపిన బెట్టింగ్ నెట్వర్క్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో మట్కాలో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేశారు డైరెక్టర్ కరుణ కుమార్. ట్రైలర్ లో వరుణ్ తేజ్ గెటప్పులు, వాసు క్యారెక్టర్ పలికిన డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్నట్టు ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితోనే మట్కా కింగ్ అనే వెబ్ సిరిస్ చేస్తున్నాడు విజయ్ వర్మ. ప్రస్తుతం ప్రొడక్షన్ లో వున్న ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: