ఈసినిమాల హవాను లెక్కచేయకుండా ఈవారం దాదాపు 9 చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకో పోతున్నాయి. అయితే ఈవారం విడుదలకాబోతున్న ఈ 9 చిన్న సినిమాల పై ప్రేక్షకులలో ఎటువంటి అంచనాలు లేవు. ఈ చిన్న సినిమాల మధ్య నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ విడుదల కాబోతోంది.
‘కార్తికేయ 2’ మూవీ విడుదల కాకముందు ఎప్పుడో ఈసినిమా ప్రారంభం అయి అనేక సమస్యలు దాటుకుని ఇప్పుడు ఈసినిమా విడుదల అవుతోంది. షూటింగ్ ఎప్పుడు జరిగిందో తెలియని ఈమూవీ ప్రమోషన్ ఇప్పుడు హడావిడిగా చేస్తూ నిఖిల్ సుధీర్ వర్మలు హడావిడి చేస్తున్నారు. ఈసినిమా కాకుండా ‘ధూమ్ ధామ్’ ‘జితేందర్ రెడ్డి’ ‘జాతర’ ‘ఈసారైనా’ ‘రహస్యం’ ‘ఇదం జగత్’ ‘వంచన’ ‘జ్యూయల్ థీఫ్’ మూవీలు కూడ విడుదల కాబోతున్నాయి. అయితే సినిమాలు చూసేవారికి కూడ ఈమూవీ టైటిల్స్ గురించి కానీ ఈమూవీలో ఎవరెవరు నటించారు అన్న విషయాలు తెలియవు.
అలాంటి సినిమాలు ఇప్పుడు ఒక్కసారిగా ఊడిపడితే ప్రేక్షకులు కనీస సంఖ్యలో అయినా ఏఏమూవీలకు వస్తారా అన్నది సమాధానం లేని ప్రశ్న. దీనికితోడు గతవారం విడుదలైన దీపావళి సినిమాలకు టాక్ బాగా రావడంతో సినిమాలు చూడాలి అని ఉత్సాహ పడే ప్రేక్షకులు హిట్ అయిన సినిమాలకు వెళతారు కాని ఏమాత్రం తెలియని ఈకొత్త సినిమాల వైపు హిట్ టాక్ వస్తే కానీ రారు అన్నది వాస్తవం. దీనికితోడు వచ్చేవారం భారీ అంచనాలతో ‘కంగువ’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈచిన్నసినిమాలు కేవలం ఒక వారం రోజులకే పరిమితం అయ్యే ఆస్కారం ఉంది..